కింగ్ ఆఫ్ పాప్.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ రిలీజ్ కి సిద్ధం

ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పాప్ రంగంలో ఎంతోమంది పేరు మోసిన సింగర్స్ ఉండి ఉండొచ్చు కానీ వారి అందరికీ ఓజి మాత్రం మైఖేల్ జాక్సన్ అనే చెప్పాలి. ఇప్పుడు చూస్తున్న క్రేజ్ కి పదింతలు ఎలాంటి సోషల్ మీడియా లేని సమయంలో కింగ్ ఆఫ్ పాప్ చూసారు. అయితే తన జీవిత చరిత్ర తన ప్రయాణం అలానే తన మరణం కూడా ఎంతో మిస్టరీ అని చెప్పాలి. తనపై ఎన్నో కోణాలు తన మరణానంతరం వినిపించాయి.

మరి వీటికి సమాధానంగా అన్నట్టు తనపై ఇపుడు సిద్ధం అయ్యిన బయోపిక్ చిత్రమే “మైఖేల్”. జాఫర్ జాక్సన్ మైఖేల్ జాక్సన్ రోల్ లో నటిస్తుండగా ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించిన ఈ సినిమా తాలూకా ట్రైలర్ లేటెస్ట్ గా విడుదల కాగా దీనికి ఇప్పుడు అనూహ్య స్పందన ప్రపంచ ఆడియెన్స్ నుంచి వస్తుంది. ఇక ఈ ట్రైలర్ తో మేకర్స్ ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 24న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతానికి సినిమా డబ్బింగ్ వెర్షన్ లపై ఎలాంటి సమాచారం లేదు.

Exit mobile version