సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు.
ఈ సినిమాలో 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ ఉందని.. అందులో మహేష్ బాబు నటవిశ్వరూపం చూసి తాను అవాక్కయ్యానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన చూసినప్పుడు ఎలాంటి వీఎఫ్ఎక్స్, మ్యూజిక్ లేదని.. అయినా తాను ఇంప్రెస్ అయ్యానని తెలిపారు. దీంతో ఈ 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్‌లో మహేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.


