మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేస్తున్న సినిమాలు కాకుండా అనౌన్స్ అయ్యి తన రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తదుపరి సినిమాలు ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో తన బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు బాబీతో చేయనున్న సినిమా కూడా ఒకటి. ఇది మెగాస్టార్ కెరీర్ 158వ సినిమాగా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాకి రీసెంట్ గానే కొత్త లోక సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి ఎంటర్ అవ్వడం కూడా జరిగింది.
అయితే తాను ఈ సినిమా ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయినట్టు ఓ పిక్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. సో స్క్రిప్ట్ పరంగా అన్ని పనులు అయ్యినట్టే అని చెప్పాలి. ఇక నెక్స్ట్ షూటింగ్ మాత్రమే మొదలు కావాల్సి ఉంది. ఇక దీనిపై క్లారిటీ రానుంది. మరి ఈ చిత్రానికి కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా 2027 సంక్రాంతికి సినిమాని టార్గెట్ చేస్తున్నారు.


