అఫీషియల్ : ‘వారణాసి’తో వండర్స్ చేయబోతున్న మహేష్ బాబు

అఫీషియల్ : ‘వారణాసి’తో వండర్స్ చేయబోతున్న మహేష్ బాబు

Published on Nov 15, 2025 7:29 PM IST

SSMB29

యావత్ సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ SSMB29 చిత్రం నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్ర టైటిల్, గ్లింప్స్ ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌లో రివీల్ చేస్తున్నారు.

ఇక అభిమానులు ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అని ఆసక్తిగా చూస్తుండగా, ఈ ఈవెంట్‌లో చిత్ర టైటిల్, గ్లింప్స్ రివీల్ చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. చేతిలో త్రిశూలం పట్టుకుని, నంది వాహనంపై తాండవం చేసేందుకు మహేష్ బాబు సిద్ధమయ్యాడు. ఈ వీడియోలో మహేష్ లుక్స్‌కు అభిమానులు అరుపులతో రెచ్చిపోయారు.

ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి కథను చూపిస్తాడా.. అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.

తాజా వార్తలు