వారణాసి @ సమ్మర్ 2027

వారణాసి @ సమ్మర్ 2027

Published on Nov 15, 2025 9:00 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’ గ్లోబ్ ట్రాటరింగ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాజమౌళి మార్క్‌తో ఈ ఈవెంట్ అద్భుతంగా ప్లాన్ చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంబంధించి ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ ప్రెస్టీజియస్ వారణాసి చిత్రాన్ని 2027 సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో మహేష్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు