ఏప్రిల్ 9న రాబోతున్న ‘వకీల్ సాబ్’ !

ఏప్రిల్ 9న రాబోతున్న ‘వకీల్ సాబ్’ !

Published on Jan 30, 2021 9:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు ఇది తెలుగు రీమేక్. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ ముగిసింది. పవన్ కమ్ బ్యాక్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.

అందుకే శాటిలైట్ హక్కులను భారీ డిమాండ్ ఏర్పడింది. ఫిలిం నగర్ ఇన్ఫర్మేషన్ మేరకు ఈ హక్కులను జీ తెలుగు దక్కించుకున్నట్టు.. సుమారు 15 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయిందని రీసెంట్ గా వార్తలు కూడా వచ్చాయి. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు