“వకీల్ సాబ్” టీం ప్లానింగ్ అదిరింది.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చాలా కాలం గ్యాప్ అనంతరం స్టార్ట్ చేసిన చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ కం బ్యాక్ చిత్రం విడుదల కోసమే పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే దర్శకుడు శ్రీరామ్ వేణు టీం నుంచి మాతరం అప్డేట్ ఈ మధ్య కాలంలో నత్త నడకగానే వచ్చాయి.

ఒక్క టీజర్ అలాగే రిలీజ్ డేట్ మినహా సినిమాకు సంబంధించి మేజర్ అప్డేట్స్ ఏమి రాలేదు కానీ లేటెస్ట్ గా మాత్రం ఇక నుంచి వకీల్ సాబ్ అప్డేట్స్ వరుస పెట్టి రావడం కన్ఫర్మ్ అయ్యింది. అందులో భాగంగానే ఈ చిత్రానికి ఒక స్పెషల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం నుంచి ఒక పాట వచ్చి చాలా కాలం అయ్యింది.

మళ్ళీ సంవత్సరానికి మార్చ్ లో ఇంకో సాంగ్ ను విడుదల చెయ్యడానికి ముహూర్తం ఖరారు చేసారు. అయితే ఇదే నెలను వకీల్ సాబ్ మ్యూజికల్ మంత్ గా కూడా మార్చేస్తారట. దీనితో వకీల్ సాబ్ ఫుల్ ఆల్బమ్ ఆ నెలలో కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. మొత్తానికి మాత్రం సినిమా విడుదలకు ముందు సరిగ్గా ఈ పర్ఫెక్ట్ ప్లానింగ్ అదిరింది అని చెప్పాలి..

Exit mobile version