మొత్తానికి ‘వార్ 2’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే!

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రమే “వార్ 2”. ఒక క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా మ్యూజికల్ ట్రీట్ వచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఎప్పుడు నుంచో వార్ 2 ఫస్ట్ సింగిల్ పట్ల ఆసక్తి నెలకొంది.

మేము వార్ 2 ఫస్ట్ సింగిల్ గా హృతిక్ మరియు కియారా నడుమ రొమాంటిక్ సాంగ్ వస్తుందని ముందే చెప్పాము. ఇప్పుడు అలానే మేకర్స్ ఫస్ట్ సింగిల్ గా వీరి నడుమ సాగే పాటనే దర్శకుడు అనౌన్స్ చేశారు. ఈ జూలై 31న కియారా పుట్టినరోజు కానుకగా ఈ సాంగ్ ని లాంచ్ చేస్తున్నట్టు అయాన్ ఇపుడు కన్ఫర్మ్ చేశారు. సో ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. 2.52

Exit mobile version