రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!

vijay devarakonda, suriya

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది విజయ్ దేవరకొండ నటించిన భారీ చిత్రం “కింగ్డమ్” అనే చెప్పాలి. మరి ఈ సినిమా కోసం తెలుగు, తమిళ్ నుంచి బిగ్ స్టార్స్ తమ వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. ఇలా కోలీవుడ్ స్టార్ నటుడు సూర్యకి విజయ్ దేవరకొండ స్పెషల్ థాంక్స్ చెప్పడం జరిగింది.

తాము కింగ్డమ్ తమిళ్ వెర్షన్ టీజర్ వాయిస్ పవర్ కోసం ఒక పవర్ఫుల్ వాయిస్ అనుకున్నామని అప్పుడు వెంటనే సూర్య అన్నే తన మైండ్ లోకి వచ్చాడని అడిగిన వెంటనే ఓకే చెప్పాడు ఆయన ఎంతో దయా హృదయం కలిగిన పవర్ఫుల్ వ్యక్తి అంటూ విజయ్ చెన్నై ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక ఈ అవైటెడ్ చిత్రం ఈ జూలై 31న గ్రాండ్ గా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

Exit mobile version