‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి మేకర్స్ ఫైనల్ గా ఓ గుడ్ న్యూస్ చెప్పేసారు. ఒక క్రేజీ క్లైమాక్స్ ఎపిసోడ్ పవన్ పై తెరకెక్కించిన సన్నివేశాలతో పూర్తయిపోయినట్టుగా ఇప్పుడు తెలిపారు.

ఇక దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి సెట్స్ లో ఉన్న పవన్ లుక్ అయితే అదిరింది. మెరూన్ షర్ట్ వేసుకొని కళ్లద్దాలు పెట్టుకొని పవన్ మంచి స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ క్లైమాక్స్ పోర్షన్ ని నబ కాంత మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కించినట్టుగా తెలిపారు. మరి ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాల్లో ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version