పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ సినిమా వస్తుంది అంటే ఆ హై నే వేరే లెవెల్లో ఉంటుంది. అయితే పవన్ నటించిన లాస్ట్ మూడు చిత్రాలకు కూడా కంటెంట్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ దక్కాయి.
మరి మూడేళ్లు సుదీర్ఘ విరామం అనంతరం పవన్ చేసిన కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణుతో ప్లాన్ చేసిన ఈ రీమేక్ చిత్రంపై భారీ అంచనాలే సెట్టయ్యాయి. అయితే మరి ఇప్పుడు ఈ చిత్రం ఓపెనింగ్స్ పైనే అభిమానుల మధ్య మరియు ఇండస్ట్రీ వర్గాల్లో రచ్చ నడుస్తుంది.
దీనిపై మంచి హైప్ ఉండడం అలాగే ఈ సినిమా విడుదల సమయానికి 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావడం పైగా దగ్గరలో మరే ఇతర స్టార్ హీరో సినిమా కూడా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర పవన్ అభిమానులు భారీ లెక్కలనే ఎస్టిమేట్ చేస్తున్నారు..ఇప్పటికే బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే అవుతుందని టాక్. మరి ఈ చిత్రం మొదటి రోజు ఎంత రాబడుతుందో చూడాలి.