స్టైలిష్ “వకీల్ సాబ్” దుమ్ము లేపేలా ఉన్నాడు.!

స్టైలిష్ “వకీల్ సాబ్” దుమ్ము లేపేలా ఉన్నాడు.!

Published on Sep 2, 2020 9:32 AM IST

ఈరోజు పవన్ అభిమానులు నెవర్ బిఫోర్ డే అని చెప్పాలి. పవన్ ఇప్పటి వరకు తన సినీ ప్రస్థానంలో ఎన్నో చిత్రాలు చేశారు, పుట్టినరోజులు జరుపుకున్నారు కానీ ఈసారి పుట్టినరోజుకు మాత్రమే ఏకంగా మూడు చిత్రాల అప్డేట్స్ రావడంతో పవన్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇతర తోటి అభిమానులకే ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు.

దీనితో ఈ సమయంలో ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కానీ పరిస్థితుల్లో పవన్ సినిమాల అప్డేట్స్ మాత్రం మిగతా అభిమాన జనాన్ని నిరాశ పరచుకుండా యథావిధిగా రానున్నాయి. వాటిలో మొదటిది అలాగే మోస్ట్ అవైటెడ్ ది “వకీల్ సాబ్” మోషన్ పోస్టర్. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తాలూకా మోషన్ పోస్టర్ ను అనుకున్న సమయానికే ఇపుడు విడుదల చేసారు.

ఇది మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఎంత రీమేక్ చేస్తున్నప్పటికీ పవన్ చిత్రాల్లో ఏదో స్పెషాలిటీ అండ్ టేకింగ్ కనిపిస్తుంది. అది ఈ మోషన్ పోస్టర్ నుంచే ఉందని చెప్పాలి. స్టైలిష్ లాయర్ గా బేస్ బాల బాట్ పట్టుకుని పవన్ ఈ మోషన్ పోస్టర్ లో అదరగొట్టేసారు.

అలాగే ఈ మోషన్ పోస్టర్ లో మరో స్పెషల్ అట్రాక్షన్ ఏదన్నా ఉంది అంటే అది తమ ఇచ్చిన ఎలెక్ట్రిఫయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. మొత్తానికి మాత్రం “వకీల్ సాబ్” యూనిట్ ఈరోజు అందించిన మొదటి గిఫ్ట్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొల్పింది అని చెప్పాలి. ఈ చిత్రంలో నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో కనిపించనుండగా దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మోషన్ పోస్టర్ కోసం క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు