300 మిలియన్స్ లో బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసిన టీ సిరీస్!

300 మిలియన్స్ లో బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసిన టీ సిరీస్!

Published on Aug 23, 2025 11:15 AM IST

ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు అలాగే ఆడియో లేబుల్ సంస్థల్లో టీ సిరీస్ కూడా ఒకటి. హిందీ సినిమా దగ్గర ఎన్నెన్నో రికార్డు చార్ట్ బస్టర్స్ అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో సెన్సేషనల్ మ్యూజిక్ ఆల్బమ్స్ వీరి సొంతం.

అయితే లేటెస్ట్ గా టీ సిరీస్ వారు ఇపుడు ఓ బిగ్గెస్ట్ రికార్డుని అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ లో 300 మిలియన్ కి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్న ఏకైక సంగీత ఛానెల్ గా నిలిచి ఒక అరుదైన ఫీట్ ని అందుకున్నారు.

ఇది వరకు కూడా వరల్డ్ లోనే అత్యధిక సబ్ స్క్రైబర్స్ కలిగిన యూట్యూబ్ ఛానెల్ గా కూడా వీరే ఉండేవారు కానీ దానిని మిస్టర్ బీస్ట్ బీట్ చేసాడు. ఇక ఆ తర్వాత 300 మిలియన్ తో ఇపుడు వీరు ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నారు. మరి ఫ్యూచర్ లో ఈ మార్క్ ఎక్కడ వరకు చేరుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు