పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ పై భారీ అంచనాలున్నాయి. రాజకీయాల కోసం సినిమాలకు విరామం ప్రకటించిన పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరువాత ఈ చిత్రం చేస్తున్నారు. ఇక నేడు ఉమెన్స్ డే కానుకగా ఈ చిత్రం నుండి మగువా ..మగువా.. అనే ఓ లిరికల్ సాంగ్ వీడియో విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య మే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. కాగా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో వకీల్ సాబ్ టీజర్ సిద్ధం చేస్తున్నారట.
ఇక టీజర్ లో మూవీ మెయిన్ థీమ్ తెలియజేసేలా డిజైన్ చేయడంతో పాటు, పవన్ స్టైలిష్ అవతార్ హైలెట్ గా ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారట. పవన్ మొదటిసారి లాయర్ గా నటిస్తుండగా టీజర్ ఓ రేంజ్ లో ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడని వినికిడి. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా, బోణి కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్నారు.