పవన్ సినిమాకు ఎటూ తేల్చుకోలేకపోతున్నారా?

పవన్ సినిమాకు ఎటూ తేల్చుకోలేకపోతున్నారా?

Published on Sep 15, 2020 10:01 AM IST

ఇంకో మూడు నెలలు అయ్యిపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చి మూడేళ్లు అయ్యిపోతుంది. ఆ తర్వాత చాలా కాలం విరామం ఇచ్చి మొదలు పెట్టిన చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ గా నిలిచినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఈ చిత్రం పరిస్థితి కాస్త డైలమా లోనే ఉన్నట్టు అర్ధం అవుతుంది.

ఈ మధ్య కాలంలో ఓటిటి విడుదలలు పుంజుకున్నాయి. అలాగే ఈ చిత్రానికి కూడా భారీ ఆఫర్ ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఇవ్వగా నిర్మాత దిల్ రాజు మాత్రం అందుకు సుముఖంగా లేరని తెలిసింది. కానీ మేజర్ ఆఫ్ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఓటిటి రిలీజ్ చేసేస్తేనే బెటర్ అంటున్నారు. వకీల్ సాబ్ చిత్రానికి ఇచ్చిన ఆఫర్ చాలా మంచిదే అని ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఆఫర్ వసూళ్లు థియేటర్స్ నుంచి రావడం కష్టమే అని అంటున్నారు.

వీరే అలా అంటున్నారు కానీ దిల్ రాజు, థమన్, శ్రీరామ్ వేణులకు పవన్ ఇది మొదటి సినిమా కావడం పైగా వీరు ప్లాన్ చేసిన ఈ స్క్రిప్ట్ పై బాగా నమ్మకంగా ఉన్నారు. సో ఆ రెస్పాన్స్ ను థియేటర్స్ నుంచే వినాలి అనుకుంటున్నారేమో దీనితో ఈ చిత్రం విషయంలో మాత్రం కాస్త ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వారికి ఏర్పడింది అని చెప్పొచ్చు.

తాజా వార్తలు