పవర్ స్టార్ రేంజ్ కి తగ్గట్లు ఉంటుందట !

పవర్ స్టార్ రేంజ్ కి తగ్గట్లు ఉంటుందట !

Published on Mar 5, 2020 8:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా కలెక్షన్ల నుండి రికార్డుల వరకు అన్నిటిలోనూ ట్రేడ్ మార్క్ సెట్ చేస్తాయని గతంలోనే కొన్ని సినిమాలు రుజువు చేశాయి. ఇక సినిమాలు వదిలేసిన రెండేళ్లకు మళ్ళీ సినిమా చేస్తున్నారు. పవన్ సినిమా కోసం అర్రులు చాస్తోన్న ఫ్యాన్స్ ఇక ఉరుకుంటారా… అవుట్ ఫుట్ తో పని లేకుండా ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇండియా టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫస్ట్ సింగిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

కాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాటలు గొప్పగా ఉండేలా ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ను రెడీ చేశారట. త్వరలోనే విడుదలకానున్న ఈ పాటని పవర్ స్టార్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిందని.. ఈ పాట చాలా బావుంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటివలే హీరో నితిన్ సైతం ఈ పాట చాలా అద్భుతంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మొత్తానికి పాట పవర్ స్టార్ రేంజ్ కి తగ్గట్లు ఉంటుందట.

ఇకపోతే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2020 ప్రథమార్థంలోనే విడుదలకానుంది. ఈ చిత్రంతో పాటే క్రిష్ సినిమా కూడా చేస్తున్నారు పవన్. ఈ రెండూ పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రాన్ని స్టార్ట్ చేస్తారు.

తాజా వార్తలు