ఇప్పుడు “వకీల్ సాబ్” ఆల్బమ్ పైనే కన్ను.!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన “వకీల్ సాబ్” చిత్రం విడుదలకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో నిమగ్నం అయ్యారు. అయితే ఇది బాగానే ఉన్నా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో కోసం గత కొన్ని రోజుల నుంచి మంచి టాక్ నడుస్తుంది.

ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన మగువా మగువా సూపర్ హిట్ అయ్యింది. దీనితో మిగతా పాటలపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా థమన్ కూడా పవన్ కెరీర్ లో కొన్ని బెంచ్ మార్క్ సెట్ చేసిన మ్యూజికల్ ఆల్బమ్స్ లో ఇది కూడా ఒకటి అవుతుంది అని అభిమానులతో అంటున్నాడు.

మరి ఒక రీమేక్ సినిమా ఆల్బమ్ కే ఇంత ధీమాగా ఉన్నాడు అంటే థమన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడని చెప్పాలి. మరి ఈ ఆల్బమ్ ను ఎంత వరకు హిట్ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో నివేతా థామస్, అంజలిలు కీలక రోల్స్ చేస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version