దుబాయ్ వెళ్లనున్న వి.వి వినాయక్ బృందం

దుబాయ్ వెళ్లనున్న వి.వి వినాయక్ బృందం

Published on Mar 19, 2014 3:26 AM IST

VV-Vinayak
వి.వి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సమంత లు జంటగా నటిస్తున్న సినిమా త్వరలో దుబాయ్ లో షూట్ చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో హీరో హీరోయిన్ల పై ఒక పాటను తెరకెక్కించనున్నారని సమాచారం

ఈ సినిమా చాలా వైభవంగా గతఏడాది ప్రారంభమైంది. ఈ సినిమా నిర్మాతయిన బెల్లంకొండ సురేష్ తన కొడుకు కోసం చాలా మంచి టీం ను ఏర్పాటు చేసాడు. చాలా భాగం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా బృందం డిసెంబర్ లో షూటింగ్ కోసం జపాన్ వెళ్లనుంది

దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్. ఈ సంవత్సరంలో ఈ సినిమా మనముందుకు రానుంది

తాజా వార్తలు