బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా సాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలైనా వినాయక్, బెల్లంకొండ సురేష్ ప్రస్తుతానికి ఏ విషయాలూ తెలుపడంలేదు
ఈ సినిమాలో సమంత మరియు తమన్నా కధానాయికలు. ఇటీవలే సమంత, సాయి శ్రీనివాస్ ల నడుమ ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ వారం చివరి వరకూ ఉంటుందని అంచనా. శ్రీనివాస్ యాక్షన్ సన్నివేశాలలో తన నటన ద్వారా చాలా మంది ప్రముఖుల ప్రశంసలను పొందాడు. వినాయక్ లాంటి డైరెక్టర్ సినిమాతో తెరకు పరిచయంకావడం అతనికి సానుకులాంశమే. చోట కె నాయుడు సినిమాటోగ్రాఫర్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు