పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ డెబ్యూ చిత్రం “ఉప్పెన”. భారీ అంచనాలు నడుమ విడుదల కాబడిన ఈ చిత్రం మొదటి రోజే భారీ వసూళ్లను అందుకొని రికార్డు సృష్టించింది. ఓ డెబ్యూ హీరోకు ఆల్ టైం రికార్డుగా సెట్టయ్యింది.
అయితే అన్ని చోట్లా కూడా భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ గా రెండో రోజు నైజాం వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. అక్కడ మొదటి రోజు 3.08 కోట్లు షేర్ ను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా స్ట్రాంగ్ గా నిలిచి 2.40 కోట్ల రూపాయలను రాబట్టి ఆశ్చర్యపరిచింది.
అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు 7 కోట్ల షేర్ ను రాబట్టిందట దీనితో రెండు రోజులకు గాను ఈ చిత్రం 16 కోట్ల షేర్ ను రాబట్టి త్వరలనే బ్రేకీవెన్ కు శరవేగంగా దూసుకుపోతుంది. మరి ఈ మూడో రోజుతో డెఫినెట్ గా 21 కోట్ల టార్గెట్ ను ఈ చిత్రం క్రాస్ చేసేస్తోంది అని చెప్పాలి.
మరి ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.