‘ఉప్పెన’ దర్శకుడికి మెగా కాంపౌండ్ నుండి పెద్ద ఆఫర్ ఉందా ?

‘ఉప్పెన’ దర్శకుడికి మెగా కాంపౌండ్ నుండి పెద్ద ఆఫర్ ఉందా ?

Published on Feb 8, 2021 9:15 PM IST


మెగా కాంపౌండ్ నుండి రానున్న చిత్రాల్లో ‘ఉప్పెన’ కూడ ఒకటి. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇందులో హీరోగా నటించాడు. ఇదే అతనికి డెబ్యూ సినిమా. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బుచ్చిబాబుకు కూడ దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. బుచ్చిబాబు సుకుమార్ వద్దే దర్శకత్వ మెళుకువలు నేర్చుకున్నారు. ఈ సినిమా మీద మెగా అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడ మంచి అంచనాలున్నాయి. ఇక మెగా ఫ్యామిలీ పెద్దలు సైతం ఈ సినిమా పట్ల ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు.

లాక్ డౌన్ మూలంగా ఆలస్యమైనా కూడ థియేటర్లలోనే సినిమా రిలీజ్ అవుతుండటం వెనుక చిరంజీవి ఎఫెక్ట్ ఉంది. నిన్న జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో కూడ చిరు సినిమా గురించి చాలా గొప్పగా చెప్పడం, దర్శకుడిని అభినందించడం జరిగాయి. దీన్నిబట్టి సినిమా చూసిన మెగాస్టార్ బుచ్చిబాబు పనితనం పట్ల బాగా ఇంప్రెస్ అయినట్టు అర్థమవుతూనే ఉంది. అంతేకాదు ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు మెగా కాంపౌండ్ నుండి బుచ్చిబాబుకు ఇక పెద్ద ఆఫర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అది చిరు కాదు కానీ పెద్ద యంగ్ హీరో నుండే ఉంటుందని అంటున్నారు. అదే గనుక నిజమైతే ‘ఉప్పెన’ దర్శకుడి దశ తిరిగినట్టే. ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ తరువాత ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు