“ఉప్పెన” 7వ రోజు నైజాం షేర్ వివరాలు.!

“ఉప్పెన” 7వ రోజు నైజాం షేర్ వివరాలు.!

Published on Feb 19, 2021 11:00 AM IST

మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బూచి బాబు సానా దర్శకత్వంలో గత వారం వచ్చిన చిత్రం “ఉప్పెన”. ఈ ముగ్గురికీ కూడా డెబ్యూ చిత్రంగా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లను రాబట్టింది. మంచి టైం లో రావడం ఆడియెన్స్ ను మెప్పించడంతో అన్ని ఏరియాల్లో కూడా వసూళ్లు దుమ్ము లేపేసింది.

ఇక ఈ ఏడవ రోజు నైజాం వసూళ్ల విషయానికి వస్తే అక్కడ ఇప్పటికీ డీసెంట్ హెల్డ్ ను ఈ చిత్రం కనబరిచింది. 70 లక్షల షేర్ ను అక్కడ ఈ చిత్రం రాబట్టింది. దీంతో ఇన్ని రోజులకు కలిపి 8.11 కోట్లు షేర్ ను రాబట్టింది. మొత్తానికి మాత్రం ఈ చిత్రం ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లనే అందుకొని నయా రికార్డు సెట్ చేసింది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ మరియు వెర్సిటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిలు ఎంత ప్లస్ అయ్యారో కూడా తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు