కూలీ ప్లాట్ ముందే చెప్పేసిన లోకేష్ కనగరాజ్

కూలీ ప్లాట్ ముందే చెప్పేసిన లోకేష్ కనగరాజ్

Published on Jul 27, 2025 1:27 PM IST

Coolie-Movie

ప్రస్తుతం సౌత్ లో మంచి అంచనాలు సెట్ చేసుకున్న అవైటెడ్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం “కూలీ” కూడా ఒకటి. అయితే ఈ సినిమాపై మాత్రం ఆడియెన్స్ లో గట్టి అంచనాలే నెలకొన్నాయి.

కేవలం టీజర్ ఇంకా పాటలతోనే సాలిడ్ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలకి ముందే ఎలా ఉంటుంది? లోకేష్ గత సినిమాలతో లింక్ ఏమన్నా ఉందా అనే ఊహాగానాలే ఆడియెన్స్ ఎక్కువ పెట్టేసుకున్నారు. ఇలా సినిమా నేపథ్యం ఏంటి ఇతర అంశాలు మంచి సస్పెన్స్ గా నిలవగా లేటెస్ట్ గా లోకేష్ కనగరాజ్ అసలు కూలీ ప్లాట్ ఏంటి అనేది రివీల్ చేసేసాడు.

కూలీ సినిమాలో గన్స్ ఉండవ్, డ్రగ్స్ ఉండవ్, ఎలాంటి టైం ట్రావెల్ సినిమా కూడా కాదు సినిమా మొత్తం లగ్జరీ వాచ్ లు వాటి ఫ్యాక్టరీకి సంబంధించే ఉంటుంది అని అసలు విషయం తెలిపాడు. దీనితో కూలీ సినిమా పట్ల మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ జూలై 14న వచ్చే సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు