పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి దాదాపు ఐదేళ్ల పాటుగా తెరకెక్కి ఈ ఏడాదిలో చాలా అడ్డంకులు ఇబ్బందులు తర్వాత రిలీజ్ అయ్యిన సినిమానే “హరిహర వీరమల్లు”. మరి లాస్ట్ మినిట్ లో పవన్ ఎప్పుడూ లేని విధంగా ప్రమోషన్స్ చేయడంతో గట్టి హైప్ వచ్చింది. ముందే పైడ్ ప్రీమియర్స్ వేయడం కూడా మేకర్స్ కాన్ఫిడెన్స్ ని చూపించింది. అయితే సినిమాలో ఒక్క నెగిటివ్ అంశం వల్ల దానికి తోడు టికెట్ ధరలు మూలాన కొంచెం బుకింగ్స్ మీద డే 2 నుంచి ఎఫెక్ట్ పడింది.
అయితే మేకర్స్ ఫైనల్ గా నార్మల్ టికెట్ ధరలకు సినిమాని అందుబాటులోకి తెచ్చేస్తున్నారు. ఇది ఎప్పుడు నుంచో కాదు రేపు జూలై 28 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి టికెట్ ధరల హైక్ లు ఉండబోవడం లేదు. ఇది వరకు ఉన్న సాధారణ టికెట్ ధరలతోనే సినిమా రన్ కానుంది. సో ఇది టికెట్ ధరలు విషయంలో వెనకడుగు వేస్తున్న ఆడియెన్స్ ని మళ్ళీ రప్పిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.