ZEE5లో ఆగస్ట్ 8న విడుదల కానున్న “మోతెవరి లవ్ స్టోరీ” సిరీస్ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించగా, శివ కృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు. ఏడూ ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉందని ఇప్పటికే టీజర్‌తోనే అర్థమైంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, “మోతెవరి లవ్ స్టోరీ ట్రైలర్ చాలా బాగుంది. మై విలేజ్ షో టీం అందరికీ స్పూర్తి. అనిల్ ఇంకా ఎంతో ఎత్తుకి ఎదుగుతారు. ఈ సిరీస్ అద్భుతంగా ఉంటుంది, అందరూ చూడండి” అన్నారు.
అనిల్ గీలా మాట్లాడుతూ, “ఇలాంటి స్టేజ్‌కు రావడం కోసం చాలా కష్టపడ్డాం. మై విలేజ్ టీం అందరం కలిసి చేసిన ప్రయాణం ఇక్కడికి తీసుకొచ్చింది. జీ5, శ్రీధర్ అన్న మమ్మల్ని నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. ఆగస్ట్ 8న విడుదలయ్యే ఈ సిరీస్ అందరినీ నవ్విస్తుంది” అన్నారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ, “తెలంగాణలో కొత్త కథలకు తరుణ్ భాస్కర్ స్పూర్తి. మోతెవరి లవ్ స్టోరీ కొత్తగా, అందరినీ అలరించేలా ఉంటుంది” అన్నారు.
నిర్మాత శ్రీరామ్ శ్రీకాంత్, జీ5 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్, దర్శకుడు శివ కృష్ణ బుర్రా కూడా తమ అనుభూతులు పంచుకున్నారు. అందరూ ఈ సిరీస్‌ను తప్పకుండా చూడాలని కోరారు.