5వ రోజు కూడా “ఉప్పెన” స్ట్రాంగ్ వసూళ్లు..లెక్కలు ఇవే!

ఈ ఏడాది విడుదల కాబడ్డ తెలుగు చిత్రాల్లో యూనానిమస్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన మరో చిత్రం “ఉప్పెన”. మెగా కుటుంబం నుంచి వచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక రోల్ లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ ఏ డెబ్యూ హీరో సినిమాకు రాని స్థాయి వసూళ్లను రాబట్టింది.

ఇక అలాగే వీక్ డేస్ లోకి వచ్చాక కూడా ఈ చిత్రం స్ట్రాంగ్ వసూళ్లను రాబడుతూ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం తాలూకా 5వ రోజు వసూళ్ల లెక్కలు బయటకు వచ్చాయి. ఈ ఐదవ రోజు ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 3.52 కోట్ల షేర్ ను ఈ చిత్రం రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కలిపి 3.92 కోట్లు షేర్ రాబట్టింది. మరి ఏరియాల వారీగా పీఆర్ లెక్కలు గమనిస్తే..

నైజాం – రూ .1.15 కోట్లు
సీడెడ్ – రూ .65 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ .59 లక్షలు
తూర్పు – రూ .39 లక్షలు
పశ్చిమ – రూ .18 లక్షలు
కృష్ణ – రూ .19 లక్షలు
గుంటూరు – రూ .24 లక్షలు
నెల్లూరు – రూ .13 లక్షలు

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో – రూ. 3.52 కోట్లు

కర్ణాటక – రూ .15 లక్షలు
చెన్నై – రూ .7 లక్షలు
ఇతర భారత్ ప్రదేశాలలో – రూ .8 లక్షలు
ఓవర్సీస్ – రూ .10 లక్షలు

మొత్తం వరల్డ్ వైడ్ షేర్ – రూ .3.92 కోట్లు ఈ చిత్రం 5వ రోజు రాబట్టింది.

Exit mobile version