సెకండ్ హ్యాండ్ కోసం సింగల్ షాట్ లో సాంగ్

సెకండ్ హ్యాండ్ కోసం సింగల్ షాట్ లో సాంగ్

Published on Apr 25, 2013 12:00 PM IST

Second-Hand
పాపులర్ రైటర్, డైరెక్టర్ బివిఎస్ రవి నిర్మాతగా మారి చేస్తున్న తొలి ప్రయత్నం ‘సెకండ్ హ్యాండ్’. ఈ చిత్ర యూనిట్ ఈ సినిమాని సరికొత్త రీతిలో ప్రమోట్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఓ సాంగ్ ని సింగల్ షాట్ లో షూట్ చేసారు. ఈ సాంగ్ ని కంటిన్యూ గా ఎలాంటి కట్స్ లేకుండా షూట్ చేసారు. ఇలా తీయడం చాలా కష్టం అలాగే దీనికోసం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ధన్య బాలకృష్ణన్, సుదీర్ వర్మ, కిరీటి దమరాజు, అనూజ్రం, విష్ణు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. రవి చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు