పైసా కోసం ప్రత్యేక కాంటెస్ట్ ప్రారంభం

పైసా కోసం ప్రత్యేక కాంటెస్ట్ ప్రారంభం

Published on Apr 2, 2013 2:25 AM IST

Paisa
నాని తాజా చిత్రం ‘పైసా’ షూటింగ్ చివరి దశ కి చేరుకుంది. ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఈ చిత్ర నేపధ్యం మానవ బంధాలు కన్నా ఈరోజుల్లో డబ్బే మనకు ప్రధానం అన్న తరహాలో సాగుతుంది. ఈ సినిమాని ప్రమోట్ చెయ్యడానికి మార్కెటింగ్ టీం ఒక కొత్త ఐడియాతో ముందుకి వచ్చింది. పాతకాలపు నాణాలను సేకరించిన వారినుండి కొంతమంది అదృష్టవంతులని ఎంపిక చేసి వారిని ఆడియో లాంచ్ కి గెస్ట్స్ గా ఆహ్వానిస్తారట. ఇదే కాక డబ్బు నేపధ్యంలో లఘు చిత్రాలు తీసి పంపితే దానిలోంచి మంచిదాన్ని ఎంపిక చేసుకుని విజేతగా ప్రకటిస్తారట.

కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రమేష్ పుప్పాల యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నాడు. కేథరీన్ త్రేస ముఖ్య నటీమణిగా ఉన్న ఈ సినిమాలో సిద్ధిక శర్మ మరో హీరొయిన్.చరణ్ రాజ్ ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడు. సాయి కార్తిక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 11న విడుదల కావచ్చని అంచనా.

తాజా వార్తలు