స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొట్ట మొదటి సారిగా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్న చిత్రం “పుష్ప”. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందో మేకర్స్ ఇటీవలే కన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఒక ఊహించనటువంటి ఆసక్తికర రూమర్ ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అనూహ్యంగా ఊపందుకుంది.
ఈ చిత్రం తాలూకా విడుదల తేదీ విషయంలో దర్శకుడు సుకుమార్ సంతృప్తిగా లేరని అనేక రకాల ఊహాగానాలు దీనిపై చక్కర్లు కొడుతున్నాయి. అయితే సుకుమార్ ప్రమేయం లేకుండానే విడుదల తేదీ అది కూడా బన్నీ మరియు సుకుమార్ ల ఫ్రెండ్షిప్ తెలిసిందే.
అలాంటిది సుక్కుకి ఇష్టం లేకుండా విడుదల తేదీ ప్రకటించడం అనేది అసాధ్యం సో ఇవి కేవలం రూమర్స్ వరకే పరిమితం అయ్యి ఉంటాయి తప్పితే ఏదైనా నిజం తెలిసే వరకు లేదు. ఇక ఈ సాలిడ్ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.