చెన్నైలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా ప్రదర్శన పొడిగింపు


మంచు మనోజ్, బాలకృష్ణ ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” రాష్ట్రమంతటా మంచి ఓపెనింగ్స్ సాదించింది. శేఖర్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మీ మంచు నిర్మించారు. ఈ చిత్రం అక్కడ రెండు పెద్ద ప్రముఖ థియేటర్లలో విడుదల అయ్యింది. ఆ చిత్రం అక్కడ బాగా ఆదరించడంతో థియేటర్ యాజమాన్యం ఈ చిత్రాన్ని ఈ వారం మొత్తం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. “కాసినో మరియు సత్యం థియేటర్లలో “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించింది. కాబట్టి వాళ్ళు ఈ చిత్రాన్ని ఈ వారం మొత్తం ప్రదర్శిస్తున్నారు” అని లక్ష్మీ మంచు ట్విట్టర్లో తెలిపారు. ఈ చిత్ర ఓపెనింగ్స్ విషయంలో చిత్ర బృందం మొత్తం సంతోషంగా ఉన్నారు ప్రస్తుతం పైరసీని అరికట్టడానికి చర్యలు చేపడుతున్నారు. బోబో శశి సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version