ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఒక మల్టీ స్టారర్ చిత్రం – మనోజ్

ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఒక మల్టీ స్టారర్ చిత్రం – మనోజ్

Published on Apr 7, 2012 10:41 PM IST

చిత్రంలో బాలకృష్ణ పాత్రని ఉద్దేశించి మంచు మనోజ్ “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రం మల్టీ స్టారర్ అని తెలిపారు. మొదట ఈ చిత్రం లో బాల కృష్ణ అతిధి పాత్రలో కనిపించబోతున్నారు, ఈ పాత్ర ఈ చిత్రానికి కీలకం అని పుకారు నడిచింది. ఈ పుకారులన్నింటికి తెర దించుతూ బాల కృష్ణ చిత్రం ఆసాంతం కనిపించబోతున్నారని మనోజ్ తెలిపాడు. ఈ మధ్యనే ఈ చిత్ర నిర్మాత లక్ష్మి మంచు ఈ చిత్రంలో బాల కృష్ణ ఫోటో ఒకటి విడుదల చేసింది. అందులో బాలయ్య బాబు రాజసం చూసి అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఈ చిత్రం దాదాపుగా పూర్తికావొచ్చింది ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటుంది. దీక్షా సెత్ మరియు సోను సూద్ ఈ చిత్రంలో మిగిలిన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శేకర్ రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బోబో శశి సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజా వార్తలు