ఒక ఇంటివాడవుతున్న ఉదయ్ కిరణ్

ఒక ఇంటివాడవుతున్న ఉదయ్ కిరణ్

Published on Oct 11, 2012 7:52 AM IST


ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో వచ్చిన చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరో ఉదయ కిరణ్. అతి తక్కువ కాలంలోనే ‘నువ్వు నేను’ మరియు ‘మనసంతా నువ్వే’ లాంటి హిట్ సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత సరైన హిట్ లేక హిట్ కోసం తెగ
ట్రై చేస్తున్న ఉదయ కిరణ్ ఈ నెలలో తను ప్రేమించిన విశిత అనే అమ్మాయిని తమ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. విశిత హైదరాబాదీ అమ్మాయి మరియు వీరి ఇరువురి పెళ్లి ఈ నెల 24న జరగనుంది. ‘ మా పెళ్లి మాకిష్టమైన ఏదైనా గుడిలో చేసుకోవాలనుకుంటున్నాం. మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా పెళ్లిని ప్లాన్ చేసుకుంటున్నామని’ ఉదయ కిరణ్ అన్నారు. ప్రస్తుతం ఉదయ కిరణ్ పవర్ఫుల్ పోలీసు పాత్రలో నటిస్తున్న ‘జై శ్రీ రామ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఒకటవుతున్న ఈ జంట వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు