ఈ చిత్రం నా కెరీర్ ని మలుపు తిప్పుతుంది – ఉదయ కిరణ్

uday-kiran
ఉదయ్ కిరణ్ మరియు రేష్మలు ప్రధాన పాత్రలలో ఒక చిత్రం రానుంది. “జై శ్రీరామ్” అనే పేరుతో రానున్న ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ యాక్షన్ హీరోగా రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నారు. ఇదే విషయం అయన చెబుతూ ” నా పన్నెండేళ్ళ కెరీర్ లో నేను చాల ఇష్టపడి, కష్టపడి చేసిన చిత్రం ఇది ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు లవర్ బాయ్ లానే కనిపించాను మొదటిసారి యాక్షన్ హీరోగా ప్రయత్నించాను. ఈ చిత్రం నా కెరీర్ ని మలుపు తిప్పుతుంది” అని అన్నారు బాలాజీ ఎన్ సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్ మరియు రాజేష్ ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం మీద నిర్మిస్తున్నారు. హరీష్ కల్యాణ్, ఆదిత్యమీనన్, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, అలీ, బెనర్జీ తదితరులు ఈ చిత్రంలో నటించారు దాకె సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ఆఖరి వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ చిత్ర ఆడియో విడుదల చెయ్యనున్నారు.

Exit mobile version