ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు బాక్స్ ఆఫీసు వద్ద రిలీజ్ అయితేనే ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అదే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ సూపర్స్ స్టార్స్ అయిన ఇద్దరి సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఎలా ఉంటుంది. త్వరలోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకోనుంది. ఆ సూపర్ స్టార్స్ లో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరైతే మరొకరు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.
విషయంలోకి వెళితే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన గ్రాఫికల్ మానియా ‘కొచ్చాడియన్’ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానున్నట్లు నిన్ననే ప్రకటించారు. ఈ సినిమా 7 ఇండియన్ భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా ఒకే రోజు విడుదల చేయనున్నారు. మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ‘భూత్ నాత్ రిటర్న్స్’ సినిమా కూడా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. సినీ అభిమానులు ఈ రెండు సినిమాలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.