కెమెరామెన్ గంగతో రాంబాబు ఆడియోతో పాటు మరో బంపర్ ఆఫర్

కెమెరామెన్ గంగతో రాంబాబు ఆడియోతో పాటు మరో బంపర్ ఆఫర్

Published on Sep 25, 2012 12:29 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ మీద దృష్టి పెడుతున్నారు. ఈ చిత్ర ఆడియో ఈ నెల 26న నేరుగా మార్కెట్లోకి విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం ఆ రోజు ఆడియోతో పాటు అదిరిపోయే రెండు ట్రైలర్స్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్స్ చూసిన వారు పవన్ కళ్యాణ్ మార్క్ స్టైల్లో ఉన్న ట్రైలర్స్ అందరికీ నచ్చుతాయని అంటున్నారు. ఒక సోషియల్ మెసేజ్ తో పూర్తి ఎంటర్టైనింగ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని డి.వి.వి దానయ్య నిర్మించారు. మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో గాబ్రియేల బెర్తంతే ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు