పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ మీద దృష్టి పెడుతున్నారు. ఈ చిత్ర ఆడియో ఈ నెల 26న నేరుగా మార్కెట్లోకి విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం ఆ రోజు ఆడియోతో పాటు అదిరిపోయే రెండు ట్రైలర్స్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్స్ చూసిన వారు పవన్ కళ్యాణ్ మార్క్ స్టైల్లో ఉన్న ట్రైలర్స్ అందరికీ నచ్చుతాయని అంటున్నారు. ఒక సోషియల్ మెసేజ్ తో పూర్తి ఎంటర్టైనింగ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని డి.వి.వి దానయ్య నిర్మించారు. మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో గాబ్రియేల బెర్తంతే ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కెమెరామెన్ గంగతో రాంబాబు ఆడియోతో పాటు మరో బంపర్ ఆఫర్
కెమెరామెన్ గంగతో రాంబాబు ఆడియోతో పాటు మరో బంపర్ ఆఫర్
Published on Sep 25, 2012 12:29 AM IST
సంబంధిత సమాచారం
- ‘హను మాన్’ స్ట్రాటజీ తోనే ‘మిరాయ్’.. వర్కౌట్ అయితే మాత్రం..!
- అఫీషియల్ : ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడో..?
- ‘బిగ్ బాస్ 9’: మొత్తానికి కొత్త సీజన్ లాంచ్ డేట్ వచ్చేసింది!
- అప్పుడే యూఎస్ మార్కెట్ లో ‘ఓజాస్’ ఊచకోత
- అఫీషియల్: ‘ది రాజా సాబ్’ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ వచ్చేసింది!
- చైతు సాలిడ్ థ్రిల్లర్ లోకి ‘లాపతా లేడీస్’ నటుడు!
- పోల్ : ‘మిరాయ్’ ట్రైలర్ మీకెలా అనిపించింది?
- ట్రైలర్ టాక్: గ్రాండ్ ట్రీట్ ఇవ్వడానికి రాబోతున్న ‘మిరాయ్’
- మరో ఓటిటిలోకి కూడా వచ్చిన నితిన్ రీసెంట్ సినిమా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!