ఆచార్య స్టోరీ లైన్ ఇదే నంటూ మెగాస్టార్ చిరంజీవి కొంచెం హింట్ ఇచ్చారు. సామాజిక బాధ్యత కలిగిన ఓ వ్యక్తి సహజ సంపదను కాపాడడం కోసం ప్రభుత్వంపై ఎలా పోరాటం సాగించాడు అన్నదే ఈ కథ అని అన్నారు. సోషల్ మరియు పొలిటికల్ థ్రిల్లర్ గా ఆచార్య ఉంటుందని చిరు చెప్పడం జరిగింది. కొరటాల శివ గత చిత్రం భరత్ అనే నేను కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. కమర్షియల్ అంశాలుగా జోడించి కొరటాల కాంటెంపరరీ పొలిటికల్ ఇష్యూస్ ని టచ్ చేస్తూ ఆచార్య తీసే అవకాశం ఉంది.
కాగా ఈ చిత్రం తరువాత మెగాస్టార్ మరో పొలిటికల్ థ్రిల్లర్ చేయనున్నాడు. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ రైట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ దక్కించుకుంది. ఇక ఈ మూవీ తెలుగు స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో సాహో దర్శకుడు సుజీత్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరు నుండి బ్యాక్ టు బ్యాక్ పొలిటికల్ థ్రిల్లర్స్ రానున్నాయి. మెగాస్టార్ తన కెరీర్ లో పొలిటికల్ థ్రిల్లర్స్ చేసింది చాల తక్కువ. అలాంటిది ఆచార్య, లూసిఫర్ తెలుగు రీమేక్ రెండు పొలిటికల్ థ్రిల్లర్స్ కావడం విశేషం.