మరో నటుడికి కరోనా.. షూటింగ్స్ కి బ్రేక్

మరో నటుడికి కరోనా.. షూటింగ్స్ కి బ్రేక్

Published on Jun 24, 2020 7:02 AM IST

హైదరాబాద్ వేదికగా కరోనా విజృంభిస్తుంది. లాక్ డౌన్ సడలింపులు అనంతరం ఈ మహమ్మారి ప్రజలపై పంజా విసురుతుంది. ఇక కరోనా టాలీవుడ్ ని తాకి పెద్ద షాక్ ఇచ్చింది. నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ దీని బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. కాగా బుల్లి తెరకు కూడా కరోనా పాకింది. సీరియల్స్ నటుడు ఒకరు దీని బారిన పడ్డారు.

ప్రభాకర్ అనే బుల్లి తెర నటుడికి కరోనా అని తేలింది. ఆయన ఇటీవల ఓ సీరియల్ షూటింగ్ లో పాల్గొనడంతో కలలం రేగింది. ఆ షూటింగ్ లో పాల్గొన్న. సిబ్బంది మొత్తం కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. సదరు టీవీ సీరియల్ షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ నటుడు జీ తెలుగులో ప్రసారం అయ్యే సూర్యకాంతం సీరియల్ లో నటిస్తారు. తాజా ఘటన అరాకొరా జరుగుతున్న షూటింగ్స్ పై ప్రభావం చూపనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు