భారీ మొత్తానికి అమ్ముడుపోయిన “తుపాకి” తెలుగు రైట్స్

భారీ మొత్తానికి అమ్ముడుపోయిన “తుపాకి” తెలుగు రైట్స్

Published on Oct 8, 2012 9:35 PM IST


ప్రస్తుతం తమిళనాడులో భారీ క్రేజ్ ఉన్న చిత్రం “తుపాకి”. విజయ్ మరియు మురగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తెలుగు పంపిణి హక్కుల కోసం తెలుగులో నిర్మాతల్లో పెద్ద పోటీనే నెలకొంది. చివరగా ఈ చిత్రాన్ని శోభారాణి దక్కించుకున్నారు. గతంలో “సూర్య సన్ ఆఫ్ కృష్ణన్” మరియు “దశావతారం” వంటి భారీ చిత్రాలను అందించిన ఎస్వీఆర్ మీడియా వారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్ర అనువాద హక్కులను వీరు 15 కోట్లు ఇచ్చి కొన్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ మరియు కాజల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి తెలుగులో కూడా “తుపాకి” అనే పేరుని పెట్టారు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దీపావళి రేస్ లో ఈ చిత్రం ఎంతవరకు విజయం సాదిస్తుందో చూడాలి.

తాజా వార్తలు