జీవాతో తులసి నాయర్ రెండవ సినిమా

జీవాతో తులసి నాయర్ రెండవ సినిమా

Published on Dec 26, 2012 12:55 AM IST

Jeeva-and-tulasi
సినిమాటోగ్రాఫర్స్ దర్శకులుగా మారిన జాబితాలో రవి కే చంద్రన్ చేరాడు. ‘దిల్ చాహ్తా హై’, బాయ్స్, గజిని, సెవెంత్ సెన్స్ వంటి ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రవి కే చంద్రన్ మెగాఫోన్ పట్టుకున్నారు. రంగం సినిమాతో తెలుగు వారికీ దగ్గరైన జీవా హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి తమిళ్లో ‘యాన్’ అనే టైటిల్ ఖరారు చేసారు. తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మణిరత్నం ‘కడలి’ సినిమా ద్వారా పరిచయం కాబోతున్న తులసి నాయర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. తులసి నాయర్ సీనియర్ నటి రాధ రెండవ కుమార్తె. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని చెన్నై, ముంబై, హైదరాబాద్, మొరాకో తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారు.

తాజా వార్తలు