ఒకే ఒక్క ఛాన్స్ తో వెల్డర్ టు డైరెక్టర్

ఒకే ఒక్క ఛాన్స్ తో వెల్డర్ టు డైరెక్టర్

Published on Oct 11, 2012 2:36 AM IST


పరిశ్రమలో ఎదగాలనే తపన ఉండాలే కాని ఎలా వచ్చాం అన్నది పక్కన పెడితే ఎక్కడికి చేరుకోబోతున్నాం అన్నదే ప్రశ్న ఇక్కడ? అలా తను అనుకున్న స్థాయికి చేరుకున్న ఒక వ్యక్తే శ్రీను. చిత్రం కోసం పని చేసే స్థాయి నుండి చిత్రం తీసే స్థాయి వరకు ఎదిగిన శ్రీను పరిశ్రమలో “వెల్డింగ్ శ్రీను” గా బాగా ప్రసిద్ది. అవునండి ఇతను పరిశ్రమలో వెల్డింగ్ నిపుణుడిగా ప్రసిద్ది. చిత్రాల మీద ఉన్న అమితమయిన ఇష్టం ప్రస్తుతం ఆయనకి అవకాశం తెచ్చిపెట్టింది. ఆయన తీయబోతున్న చిత్రంకి కూడా సరిగ్గా అయన జీవితానికి తగ్గట్టుగానే పేరు కుదిరింది “ఒకే ఒక్క ఛాన్స్”.

దిలీప్ కుమార్ మరియు నిషా షా ప్రధాన పాత్రలలో రాబోతున్న ఈ చిత్రం గురించి పలువురు పరిశ్రమ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఒక వెల్డింగ్ టెక్నీషియన్ గా మొదలు పెట్టి దర్శకుడిగా మారడం సామాన్య విషయం కాదు అని అందరు అంటున్నారు. లోకేష్ కనికినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రమణ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఈ చిత్ర ఆడియో వచ్చే నెల విడుదల కానుంది. ఈ చిత్రం పైరసీ ని అంతం చెయ్యాలనే అంశం చుట్టూ ఉంటుంది అని దర్శకుడు అన్నారు . ఈ చిత్రం విజయం సాదించాలని ఆశిద్దాం.

తాజా వార్తలు