చిరుకు జోడీ ఎవరనేది అప్పుడే తెలుస్తుంది

చిరుకు జోడీ ఎవరనేది అప్పుడే తెలుస్తుంది

Published on Mar 9, 2020 9:31 PM IST

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయకిగా త్రిషను అనుకున్నారు కానీ ఇంకా అధికారంగా ప్రకటించలేదు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్లో చిరుపై ఒక పాట, కొన్ని ఫైట్స్ మాత్రమే చిత్రీకరించారు. ఇక అసలు టాకీ పార్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంది. సినీ వర్గాల సమాచారం మేరకు ఇంకో వారంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలవుతుందట.

హీరోయిన్ త్రిష కూడా ఈ షూట్లో పాల్గొంటారని, అప్పుడే ఆమె పేరును ప్రకటిస్తారని సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కోసం రెజినా కసాండ్రను ఎంపిక చేశారు కొరటాల. మరోవైపు చిత్రంలో మహేష్ బాబు అతిధి పాత్ర చేస్తారనే టాక్ ఉన్నా ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ అందలేదు. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు నెలలో చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ ఫైనల్ చేశారు.

తాజా వార్తలు