యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మొదట అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తారని ప్రకటించారు. అయితే, ఆయన బిజీ షెడ్యూల్స్ కారణంగా ఇప్పుడు అతని స్థానంలో రవి బస్రూర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
యశ్‌కు KGF ఫ్రాంచైజ్‌తో భారీ విజయాన్ని ఇచ్చిన రవి బస్రూర్ మళ్లీ ఈ సినిమాకి సంగీతం అందిస్తారని అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంది. తాజా బజ్ ప్రకారం, మొత్తం సౌండ్‌ట్రాక్‌ని రవీ బస్రూర్ చూసుకుంటూ, యశ్‌తో నిరంతరం చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన ఈ సినిమా గ్లింప్స్‌కు సంగీతం కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, పూర్తి స్థాయి కన్ఫర్మేషన్ కోసం అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.


