అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కూడా తమ నెక్ట్ ప్రాజెక్ట్స్ పాన్ ఇండియా చిత్రాలుగా విడుదల చేయునున్నారు. బన్నీ-సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో ఐదు భాషలలో విడుదల కానుంది. బన్నీ గత చిత్రం అల వైకుంఠపురంలో భారీ హిట్ కావడం వలన పాన్ ఇండియా బరిలో దిగిపోయారు.ఇక పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. మొఘలుల ఎంఫైర్ కి సవాల్ విసిరే బందిపోటుగా పవన్ కనిపించనుండగా పాన్ ఇండియా స్టోరీ కావడంతో హిందీలో కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం.
ఐతే పవన్, బన్నీ లో హిందీలో ఎంత వరకు రాణిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ లో సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. కథ యూనివర్సల్ కాన్సెప్ట్ అయివుండాలి. మన నేటివిటీకి దగ్గరగా సాగే కథలతో తెరకెక్కిన సినిమాలలో విషయం ఉన్నా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేవు. సైరా చిత్ర ఫలితం ఇందుకు ఉదాహరణ. ఆర్ ఆర్ ఆర్ సినిమా తెలుగు వీరుల కథతో తెరకెక్కుతున్నా.. ఫిక్షనల్ స్టోరీ కావడం, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ ఆ సినిమాకు అడ్వాంటేజ్. ఈ విషయంలో పవన్ సినిమాకు కొంచెం కథ పరంగా అడ్వాంటేజ్ ఉంది. మరి చూడాలి బన్నీ, పవన్ బాలీవుడ్ లో ఎంత వరకు సక్సెస్ అవుతారో.