ప్రస్తుతం జరుగుతున్న ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం దేశంలో క్రికెట్ ను, వాటి సంబంధిత సంస్థలను రక్షణాత్మక ధోరణిలోకి నేట్టేసాయి. దీని ద్వారా బాలీవుడ్ కు కుడా నష్టం వాటిల్లింది. చిన్న తరహా నటులలో ఒకరైన విందో ధారా సింగ్ ఇప్పటికే ఈ ఫిక్సింగ్ ద్వారా వార్తలలో నిలిచాడు. అంతే కాక అతను మరికొంతమంది బాలీవుడ్ తారల పేర్లను కుడా తెలిపాడని సమాచారం
చెన్నై సూపర్ కింగ్స్ కు పూర్వపు యజిమాని అయిన గురునాథ్ మేయప్పన్, చెన్నై లో ప్రముఖ ఫిలిం స్టూడియో అయిన ఏ.వి.ఎమ్ స్టూడియోస్ కు నిర్వహణాధికారి. ఇప్పుడు అతని అరెస్ట్ తమిళ చిత్ర సీమలో కొంతమందికి మింగుడుపడుటం లేదని సమాచారం. ఈ ఫిక్సింగ్ లో కొంతమంది తమిళ చిన్న తరహా నటులు కుడా వున్నారన్నది ఇప్పుడు సంచలమైన వార్త.
ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది- దీనిలో మన టాలీవుడ్ నటులు పలుపంచుకోలేదా? ప్రస్తుతానికి మన రంగంనుండి ఎవరి పేరులూ వినబడటంలేదు. ముంబాయి, ఢిల్లీ పోలీసుల సమాచారం మేరకు మరి కొన్ని ఐ.పి.ఎల్ జట్లు కుడా ఫిక్సింగ్ లో పాలుపంచుకున్నాయట. రానున్న రోజుల్లో మరికొంతమంది పేర్లు బయటకు రావచ్చు
ఈ వివాదాలలో మన తెలుగు సినిమాకు సంభందించిన వారు ఉండకూడదని ఆశిద్దాం