బిగ్ బి పుట్టినరోజుకి హాజరవనున్న టాలివుడ్ పెద్దలు

బిగ్ బి పుట్టినరోజుకి హాజరవనున్న టాలివుడ్ పెద్దలు

Published on Oct 10, 2012 10:43 PM IST


అక్టోబర్ 11న ముంబైలో జరగనున్న అమితాబ్ బచ్చన్ 70వ పుట్టినరోజు వేడుకకు గాను దేశం నలువైపుల నుండి పలువురు తారలు హాజరు కానున్నారు.జయ బచ్చన్ తెలుగు మరియు తమిళ పరిశ్రమల నుండి అమితాబ్ బచ్చన్ కి సన్నిహితులయిన వారిని ఈ వేడుకకు ఆహ్వానించినట్టు తెలుస్తుంది. రజినీకాంత్ ,చిరంజీవి మరియు నాగార్జునలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. నాగార్జున మరియు అమల అక్కినేని ఇప్పటికే ముంబై పయనమయ్యారు చిరంజీవి,రామ్ చరణ్ మరియు ఉపాసన మరియు ఇతర కుటుంబ సభ్యులు ముంబై పయనమయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొనే మరొక నటుడు రానా దగ్గుబాటి. రిలయన్స్ మీడియా వర్క్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఇది గుర్తుండిపోయే రాత్రి కానుంది.

తాజా వార్తలు