‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి శ్రీలీలపై స్పెషల్ బర్త్ డే పోస్టర్ చూసారా?

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి శ్రీలీలపై స్పెషల్ బర్త్ డే పోస్టర్ చూసారా?

Published on Jun 14, 2025 12:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కిస్తున్స్ సాలిడ్ పోలీస్ డ్రామా “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలై జెట్ స్పీడ్ లో కొనసాగుతుంది. ఇక పవన్ సరసన శ్రీలీల మొదటిసారి నటిస్తుండగా తన పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఓ స్పెషల్ బర్త్ డే పోస్టర్ ఇప్పుడు విడుదల చేశారు.

మరి ఇందులో శ్రీలీల కూల్ లుక్స్ లో చేతిలో కాఫీ కప్ తో ఓరగా చూస్తూ ఇందులో ఆమె కనిపిస్తుంది. ఇలా మేకర్స్ తమ బర్త్ విషెస్ ని ఆమెకి అందించారు. ఇక రీసెంట్ షూటింగ్ లో పవన్ తో పాటుగా శ్రీలీల కూడా జాయిన్ అయ్యింది. ప్రస్తుతం వీరి సంబంధిత సన్నివేశాలే తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు