అఖండ తాండవం ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే?

అఖండ తాండవం ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Published on Nov 27, 2025 7:59 PM IST

Akhanda 2 8

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2 – తాండవం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి సత్తా చాటేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అదిరిపోయే ఆసక్తిని క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ డేట్, టైమ్, వెన్యూ ఫిక్స్ చేశారు. నవంబర్ 28న కూకట్‌పల్లి లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటల నుండి ఈ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా థమన్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఉండబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో నందమూరి అభిమానుల కోసం థమన్ ఎలాంటి సౌండ్ చేయబోతున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది.

తమ అభిమాన హీరో క్రేజీ సీక్వెల్ వేడుకను చూసేందుకు నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ఈవెంట్‌కు హాజరవుతారని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. ఇక ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోండగా ఆది పినిశెట్టి విలన్‌గా కనిపిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు