ఘట్టమనేని వారసుడితో ‘శ్రీనివాస మంగాపురం’ చూపించనున్న అజయ్ భూపతి

ఘట్టమనేని వారసుడితో ‘శ్రీనివాస మంగాపురం’ చూపించనున్న అజయ్ భూపతి

Published on Nov 27, 2025 5:02 PM IST

Srinivasa-Mangapuram

టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ గారి మనవడు జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీకి పరిచయం అవుతూ, దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న చిత్రంతో ప్రేక్షకుల మందుకు రానున్నాడు. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే, ఈ సినిమాను వైజయంతి మూవీస్ అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. చాలా రోజులుగా ఈ టైటిల్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు అఫీషియల్‌గా ఇదే టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రషా తడాని టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ త్వరలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు