సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా

సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా

Published on Sep 6, 2025 1:01 AM IST

Tiger Shroff Baaghi 4

విడుదల తేదీ : సెప్టెంబర్ 5, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్, హార్నాజ్ కౌర్ సంధు, సోనమ్ బజ్వా తదితరులు
దర్శకుడు : ఏ. హర్ష
నిర్మాత: సాజిద్ నడియాద్వాల
సంగీతం : సంచిత్ బల్హార, అంకిత్ బల్హార
సినిమాటోగ్రాఫర్ : స్వామి గౌడ
ఎడిటర్ : కిరణ్ గౌడ, నితిన్ పాఠక్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన లేటెస్ట్ చిత్రం బాఘి-4 నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూ లో చూద్దాం.

కథ :

యాక్సిడెంట్ నుంచి బయటపడ్డ రోన్ని(టైగర్ ష్రాఫ్)ni తన ప్రేయసి అలీషా జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. అతడి అన్న జీతూ(శ్రేయాస్ తల్పడే) అసలు అలీషా అనే అమ్మాయే లేదని.. రోన్ని ది భ్రమ అని చెబుతాడు. కట్ చేస్తే.. కొందరు దుండగుల చేతిలో జీతూ చనిపోతాడు. ఇంతకీ ఆ దుండగులు ఎవరు..? వారికి రోన్ని తో ఏం సంబంధం..? జీతూ ని వారు ఎందుకు చంపారు..? అసలు అలీషా ఏం అయింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

యాక్షన్ హీరో గా టైగర్ ష్రాఫ్ మరోసారి తనదైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హెవీ యాక్షన్ సీన్స్ లో అతడి స్టంట్స్ ఆకట్టుకుంటాయి. అలీషా పాత్రలో నటించిన హార్నాజ్ కౌర్ ఆకట్టుకుంది. ఆమె చూపించిన షేడ్స్ మెప్పిస్తాయి.

సంజయ్ దత్ కు మంచి స్కోప్ ఉన్న రోల్ లభించింది. ఆయన లుక్స్, యాక్షన్ ఆకట్టుకుంటాయి. సోనమ్ బజ్వా పర్వాలేదనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్లు హెవీ గా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఇలాంటి యాక్షన్ రివెంజ్ డ్రామాలో కోర్ పాయింట్ బాగుండాలి. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో హేలుసనేషన్ అనే పాయింట్ ఎందుకు ఉందో చాలా సేపు ప్రేక్షకులకు అర్ధం కాదు.

ఇక హీరోయిన్ కోసం హీరో చేసే స్టంట్లు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ పరమ బోరింగ్ అనిపిస్తుంది. దానికి తోడు పాటలు కూడా విసిగిస్తాయి.

మంచి యాక్టర్లు ఉన్నా, వారికి ఇచ్చిన పాత్రలు ఏమాత్రం మెప్పించవు. సోనమ్ బజ్వా పాత్ర ఎందుకు వస్తుందో.. ఎందుకు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ పెర్ఫార్మన్స్ కూడా బాలేదు. కేవలం హెవీ యాక్షన్ డోస్, ఓ లవ్ ట్రాక్ తో నెట్టుకు రావాలనే మేకర్స్ ప్రయత్నం బెడిసి కొట్టింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు హరీష్ ఈ సినిమా కథను ఇంతకు మించి తీయలేని పరిస్థితి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత సాజిద్ వాలా నడియాడ్ కావడంతో దర్శకుడు చేయడానికి ఏమి లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు. సంగీతం పెద్దగా మెప్పించదు. ఎడిటింగ్ పై మేకర్స్ ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్ గా చూస్తే.. బాఘి-4 ఓ యాక్షన్ రివెంజ్ డ్రామాగా మెప్పించలేకపోయింది. టైగర్ ష్రాఫ్ చేసే స్టంట్స్, హీరోయిన్ పెర్ఫార్మన్స్, సంజయ్ దత్ లుక్స్ బాగున్నాయి. సినిమాలో రొటీన్ కథ, బోరింగ్ స్క్రీన్ ప్లే, ల్యాగ్ సీన్స్ మైనస్. యాక్షన్ మూవీ లవర్స్ ఈ వీకెండ్ వేరే ఆప్షన్స్ చూసుకోవడం బెటర్.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు